- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహాల నివారణకు కృషి చేయాలి
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ శివ లీల అన్నారు.

దిశ,ఎర్రవల్లి: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ శివ లీల అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో హై స్కూల్ లో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో 24 గంటలు బాలల సంరక్షణ కోసం 1098 సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయన్నారు. 18 సంవత్సరాలలోపు ఉన్న బాలలను పనిలోకి పెట్టుకున్నా..18 సంవత్సరం నిండకుండా అమ్మాయిలకు బాల్యవిహాలు చేసిన.. ఇవన్నీ చట్టరీత్య నేరం నేరాలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు చట్టపరంగా తీసుకుంటామన్నారు. అలాగే బడికి వెళ్లకుండా ఎవరైనా పని చేస్తున్నట్లు కనిపిస్తే వెంటెనే1098 ఫోన్ చేయమని అన్నారు. బాల్య వివాహం చేయడం వల్ల చాలా రకాల సమస్యలు రావడం జరుగుతుందన్నారు..ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ నవీన్ గారు, ఐసిడిస్ సూపర్వైజర్ జయమ్మ , ఏఎన్ఎం భారతమ్మ, ప్రధానోపాధ్యాయులు నారాయణ చారి,అంగన్వాడి టీచర్స్,ఆశ కార్యకర్తలు, టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.






