విద్యా వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు పాటుప‌డుతా : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Ratna Kumari |

విద్యా వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు పాటుప‌డుతాన‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి పేర్కొన్నారు. త‌ప‌స్ యూనియ‌న్ జిల్లా శాఖ డైరీ, క్యాలెండ‌ర్ ను తాజాగా మంత్రి చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

విద్యా వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు పాటుప‌డుతా :  మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ‌, మ‌క్త‌ల్ : విద్యా వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు పాటుప‌డుతాన‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి పేర్కొన్నారు. త‌ప‌స్ యూనియ‌న్ జిల్లా శాఖ డైరీ, క్యాలెండ‌ర్ ను తాజాగా మంత్రి చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. అనంత‌రం శాలువా క‌ప్పి పూల‌మొక్క‌ను టీచ‌ర్ల‌కు అందించారు. జిల్లాలో విద్యా వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు పాటుప‌డుతాన‌ని అందుకు త‌న‌తో సంపూర్ణంగా ప‌ని చేయించుకోవాల‌న్నారు. పాఠశాలల్లో కావలసిన సౌకర్యాలు, ఉపాధ్యాయుల సమస్యల గురించి తన స్థాయిలో జరగాల్సిన పనులన్నీ పూర్తి చేస్తానని, ఎల్లవేళలా ఉపాధ్యాయులకు అందు బాటులో ఉంటానని తెలిపారు. సురక్షిత సమాజం విద్యార్థుల నైపుణ్యాలను వెలుగు తీసి వారి బావి జీవిత భవిష్యత్తును తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులన్నారు. జిల్లా నుంచి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహ రవీందర్, మక్తల్ మాగనూరు మండల నూతన కమిటీ అధ్యక్ష కార్య దర్శులను తపస్ జిల్లా నాయకులు నాగార్జున, భీమిరెడ్డి, వెంకట్ రాములు,కె వెంకట్ రాములు, శివశంకర్, మక్తల్ మండల అధ్యక్షులు నర్సింహులు గౌరవ అధ్యక్షులు నర్సిరెడ్డి ప్రధాన కార్యదర్శి రాకేష్, మాగనూరు మండల అధ్యక్షులు బాబురెడ్డి, గౌరవ అధ్యక్షులు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి సురేష్ లతో పాటు డి, వెంకట్ రాములు, కర్ణాకర్,రవీందర్ రెడ్డి, రామాంజనేయులు,జగదీష్,నర్సింలు, ప్రవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story