విద్య సమాజానికి పునాదిగా నిలుస్తుంది

by Bhanu |

విద్యా ఏ సమాజానికైనా, ఏ సామాజిక వర్గానికైనా పునాదిగా నిలుస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

విద్య సమాజానికి పునాదిగా నిలుస్తుంది
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : విద్యా ఏ సమాజానికైనా, ఏ సామాజిక వర్గానికైనా పునాదిగా నిలుస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలకు ఎప్సెంట్, నీట్ వంటి ఎంట్రెన్స్ప రీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా అందజేసి, వారి భవిష్యత్తుకు బలమైన మార్గదర్శకంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సరైన మార్గనిర్దేశం, కష్టపడి చదివేతత్వం ఉంటే ఏ ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు తీసిపోని స్థాయిలో విజయాలు సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ స్టడీ మెటీరియల్ విద్యార్ధినీలకు కేవలం పుస్తకాలు కాకుండా, వారి కలలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి మరింత మెరుగైన ర్యాంకులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 'మహబూబ్ నగర్ ఫస్ట్' పర్యవేక్షకులు గుండా మనోహర్, ప్రిన్సిపాల్ డాక్టర్ కౌసర్ జహాన్, తదితర అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

కులాంతర వివాహం సామాజిక సమానత్వానికి బలమైన సందేశం...

కులాంతర వివాహం చేసుకుంటే సామాజిక సమానత్వానికి బలమైన సందేశం ఇచ్చినట్లు అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం పాత తోటకు చెందిన ప్రసన్న కుమార్, సుభాష్ నగర్ చెందిన అక్షిత కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహంతో సమాజానికి స్ఫూర్తిదాయకమైన అడుగు వేశారని ఎమ్మెల్యే యెన్నం కొనియాడారు.ఈ సందర్భంగా కులాంతర వివాహాన్ని ప్రోత్సాహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 లక్షల 50 వేల రూపాయల చెక్కును వారికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story