విద్యాశాఖ మంత్రిని నియమించి బడ్జెట్ ను కేటాయించాలి : రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్

by Ratna Kumari |

రాష్ట్రంలో విద్యాశాఖ కు మంత్రిని నియమించి, మూస పద్ధతులకు స్వస్తి పలికి, విద్యా రంగంలో ప్రక్షాళన చేపట్టి అదునాతన విద్యను బోధించాలని, విద్యారంగానికి 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కెటాయించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు.

విద్యాశాఖ మంత్రిని నియమించి బడ్జెట్ ను కేటాయించాలి :  రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాష్ట్రంలో విద్యాశాఖ కు మంత్రిని నియమించి, మూస పద్ధతులకు స్వస్తి పలికి, విద్యా రంగంలో ప్రక్షాళన చేపట్టి అదునాతన విద్యను బోధించాలని, విద్యారంగానికి 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కెటాయించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బికె రెడ్డి కాలనీలోని బీసీ బాలుర హాస్టల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ సంక్షేమానికి 30 వేల కోట్ల కేటాయించాలని 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి బీసీ గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలను నిర్మించాలని, అన్ని వసతి గృహాల్లో లైబ్రరీ లను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఓపెన్ పీజీ తరగతులను నిర్వహించాలని లను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రావన్ కుమార్, కార్యదర్శి నరేందర్, చందు, సాయి, శ్రీను, మణికంఠ, రామ్ చరణ్, శివ, సురేష్ పాల్గొన్నారు.

Next Story