- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే చోట విద్య : కలెక్టర్ బాదావత్ సంతోష్
మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్ (TPS) పనులను కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రత్యక్షంగా పరిశీలించారు.

దిశ, వంగూర్ : మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్ (TPS) పనులను కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ స్థలాన్ని సందర్శించి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను ఒకే చోట అందించే విధంగా ఆధునిక సదు పాయాలతో తెలంగాణ మోడల్ స్కూల్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర విద్య అందుబాటు లోకి వస్తుందని చెప్పారు. విద్యా ర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డైనింగ్ హాల్, కిచెన్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, విశాలమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, బాత్రూములు, ఆట స్థలం వంటి అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
పాఠశాల భవనం నిర్మాణం వేగ వంతంగా కొనసాగుతున్నప్పటికీ, పనుల్లో నాణ్యతకు ఎలాంటి లోపం రాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పాఠశాల భవనం బలంగా, సురక్షితంగా ఉండేలా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. తరగతి గదులు, ప్రయోగ శాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యాలు వంటి మౌలిక వసతులు సమగ్రంగా ఏర్పాటు చేయాలని, పనులు నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవా లని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా ఆలస్యం గమనించినట్లయితే తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని, పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ఇక పాఠశాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం లభిస్తుందని, ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మరింత పెరుగు తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.






