దసరాకు చుక్కా..ముక్కా బంద్‌

by Ratna Kumari |

దసరాకు చుక్కా..ముక్కా బంద్‌
X

దిశ,మిడ్జిల్ : ద‌సరా పండుగ మద్యం, మాంసం బంద్. అక్టోబర్ 2న దసరా పండుగ వస్తుండగా.. అదే రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం, మాంసం దుకాణాలు బంద్‌ చేయాలని మండల పరిషత్ అధికారులు మాంసం అమ్మే వ్యాపారులకు నోటీసులు అందజేశారు. గాంధీ జయతి రోజున మాంసం అమ్మకాలపై ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శిలు పర్యవేక్షణ చేపడుతారని, ఎవరైన విక్రయాలు చేపడితే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా రావడంతో మాంసం విక్రయదారులు అయోమయంలో పడ్డారు. దసరా అనగానే తెలంగాణలో ముక్కా చుక్కా తప్పనిసరి కానీ, ఆ రోజు గాంధీజయంతి వస్తుండటంతో మాంసం విక్రయదారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ముందు రోజు చుక్క, ముక్క

దసరా పండక్కి చుక్క, ముక్క తిందాం అంటే ముందే ప్లాన్ చేసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. హిందువులలో పెద్ద పండుగ దసరా కావడంతో వ్యాపారస్తులు కూడా ప్రజలకు అనుకూలంగా ముందు రోజే మాంసం అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. మాంసం వ్యాపారస్తులు ప్రజలకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఈ రోజే రెండు రోజులకు సరిపడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం రాత్రి సమయంలో లేదా మధ్య రాత్రి ముందస్తు గా మటన్, చికెన్, మందు తెచ్చుకొని , మరుసటి రోజు దసరా పండుగ చేసుకోవాలని అనుకుంటున్నారు. కొన్ని గ్రామాలలో ఒక రోజు తర్వాత బుధవారం రోజున దసరా పండుగ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు రెండు రోజులు దసరా పండుగ చేసుకుంటారు.

Next Story