- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి పర్యటనలో దొంగల చేతివాటం.. వీఓఏ మెడలో పుస్తెలతాడు చోరీ..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా జడ్చర్లలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.

దిశ, జడ్చర్ల: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా జడ్చర్లలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు జడ్చర్ల మీదుగా వెళుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వివోఏ సంఘం మహిళ అధ్యక్షురాలు గంగపూర్ గ్రామానికి చెందిన సరస్వతి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మూడు తులాల బంగారం పుస్తెల తాడును దొంగలించారు.
స్థానికుల తోపులాటలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో బాధిత బాధితురాలు సరస్వతి బోరున విలపించింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలపై పోరాడాలని రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే దొంగలు తన పుస్తెలతాడు దొంగిలించారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకుండా నీరుగారుస్తోందని రేవంత్ రెడ్డికి ఇచ్చిన వినతిపత్రంలో వివోఏ ల సంఘం పేర్కొంది.






