దుందుభి వాగు పై రాకపోకలు బంద్.. వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్

by Bhanu |   (  Updated:2025-07-23 04:55:47  IST  )

వర్షాలకు నాగర్ కర్నూల్ తాడూరు మండలం సిర్సవాడ శివారులో దుందుభి వాగు పొంగిపొర్లుతుంది.

దుందుభి వాగు పై రాకపోకలు బంద్.. వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్
X

దిశ, నాగర్ కర్నూల్: వర్షాలకు నాగర్ కర్నూల్ తాడూరు మండలం సిర్సవాడ శివారులో దుందుభి వాగు పొంగిపొర్లుతుంది. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పారుతుండడంతో పాటు దుందుభి వాగు జలకలను సంతరించుకుంది. కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగుకు వరద పోటెత్తింది. దీంతో వరద నీరు జోరుగా పారుతుంది. సిరసవాడ దుందుభి వాగు వరద నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తునడంతో రాకపోకలకు అంతరాయంగా మారింది.బుధవారం మాదారం నుంచి సిర్సవాడ వస్తున్నా ట్రాక్టర్ ప్రమాదవాషత్తు వాగులో కొట్టుకుపోతుండగా స్థానికులు వెంటనే జేసీబీ సహాయంతో బయటకు తీశారు.

దీంతో పైను ప్రమాదం తప్పింది. ఇది ఇలా ఉండగా గత సంవత్సరం వర్షాకాలంలో దుందుభి నది మధ్యలో 150 గొర్రెలు ఇద్దరు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. వారిని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ రెస్క్యూ టీమ్ సహాయంతో వారిని కాపాడారు. మర్నాడు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దుందుభి వాగును సందర్శించి త్వరలో బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మార్చ్ ఏడో తారీఖు 2025 బ్రిడ్జి నిర్మాణానికి 20 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని పత్రికా ప్రకటన ఇచ్చారు.

కానీ నేటి వరకు కూడా పనులు ప్రారంభం కాలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారిన బ్రిడ్జి నిర్మాణం కావడం లేదని గ్రామస్తులు వాపోయారు.ప్రస్తుతం వరద ఉధృతి పెరగడం వల్ల రాకపోకలు బంద్ అయ్యాయి. రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా మారింది. ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు వాగు పొంగడంతో రాకపోకలు బంద్ అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఇదే పరిస్థితి పునరావృతం అవుతూనే ఉంది కానీ బ్రిడ్జి ఏర్పాట్లుకు పాలకులు చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించి తక్షణమే బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story