- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పగలు డంపింగ్.. రాత్రి టిప్పర్లకు లోడింగ్..!
దిశ, మిడ్జిల్ : ఇసుక అక్రమ దందా మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. ఇసుక అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ

దిశ, మిడ్జిల్ : ఇసుక అక్రమ దందా మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. ఇసుక అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. మండలంలోని దుందుభి వాగు శివారులోని కొత్తూరు, మిడ్జిల్, కొత్తపల్లి , వాడ్యాల, చిల్వేర్ గ్రామాలలో పగలు వాగుల నుంచి ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. రాత్రివేళ్లల్లో యంత్రాలతో ట్రిప్పర్లకు లోడింగ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా వాగుల నుంచి ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తవ్వి, వ్యవసాయ. పొలాల్లోనో లేదా ఇతర ప్రదేశాల్లోనో డంపులుగా పోసి, అధిక ధరలకు విక్రయించేందుకు ఇసుక మాఫియా సిద్ధమవుతోంది.
పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ అధికారులు
మండలం లోని పలు గ్రామాల్లో ఇసుక నిల్వలు ఉన్నా.. అధికారులు స్పందించడం లేదు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన స్పందన లేదు అన్ని రైతులు అంటున్నారు. ఇసుక దందాలో కొందరికి ముడుపులు అందుతున్న కారణంగా అక్రమాలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.






