- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంగార్డులతో డీఎస్పీ ముఖాముఖి..
జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులతో ఆదివారం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో డీఎస్పీ సత్యనారాయణ ముఖాముఖి నిర్వహించారు.

X
దిశ, నారాయణపేట ప్రతినిధి: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులతో ఆదివారం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో డీఎస్పీ సత్యనారాయణ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డ్ లకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల గురించి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ గురించి, విధులు నిర్వర్తించే సమయంలో ఎదురయ్యే సమస్యలు మొదలగు విషయాల గురించి వివరించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించే సమయంలో పక్కాగా విధులు నిర్వహించాలని, వారు నిర్వర్తించే విధుల పట్ల రోల్ క్లారిటీ ఉండాలన్నారు. విధులు నిర్వర్తించే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు డేవిడ్, విజయకుమార్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
Next Story






