- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడే హంతకుడు..!
జిల్లా పరిధిలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్ లో ఈనెల 26న హత్యకు గురైన పార్వతమ్మ కేసును పోలీసులు ఛేదించారు.

దిశ, నాగర్ కర్నూల్ : జిల్లా పరిధిలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్ లో ఈనెల 26న హత్యకు గురైన పార్వతమ్మ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఖానాపూర్ గ్రామానికి చెందిన సంకి రాములు మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2012 లో అదే గ్రామానికి చెందిన మొగుతల్ల పార్వతమ్మ(46) అనే మహిళ తో వివాహేతర సంబంధం కొనసాగించడం ప్రారంభించాడు. తమ వివాహేతర సంబంధానికి పార్వతమ్మ భర్త అడ్డుగా ఉన్నాడని 2016 లో ఇద్దరు కలిసి హత్య చేసి జైలుకు వెళ్లారు.
బెయిల్ పై వచ్చి మళ్లీ సహజీవనం కొనసాగించారు. ఈ క్రమంలోనే రాములు ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన దోకూరి లక్ష్మీ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. లక్ష్మీ భర్త కు దూరంగా ఉంటుంది. ఇక ఈ విషయం పార్వతమ్మకు తెలిసి తరచూ రాములు తో గొడవ పడుతూ ఉండేది. ఎలాగైనా పార్వతమ్మను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు. ఈనెల 26న పార్వతమ్మకు మోతాదుకు మించి మద్యం తాగించి పక్కనే ఉన్న కర్రతో తల పై కొట్టి కత్తితో గొంతు కోశాడు. రాములు ఆ విషయాన్ని లక్ష్మి కి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె ఘటన స్థలానికి వెళ్లింది. లక్ష్మి మృతురాలు పార్వతమ్మ కాళ్ల మెట్టెలు, చెవిలో ఉన్న బంగారం, తన మొబైల్ ఫోన్ తీసుకొని అక్కడ నుంచి హౌసింగ్ బోర్డ్ లోని అద్దె ఇంటికి వెళ్లారు. రక్తపు మరకలు అంటిన బట్టలు మార్చుకొని అగ్గిపెట్టె తీసుకొని ఖానాపూర్ శివారులోని ఘటనా స్థలానికి వెళ్లి మొక్కజొన్న చెత్తలో మృతదేహాన్ని వేసి కాల్చారు. పొలం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితులు రాములు, లక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.






