రాజాపూర్ లో తాగునీటి స‌మ‌స్య‌

by velandi.Saikiran |

కోడే ర్ మండలం రాజాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. సోమవారం నుంచి

రాజాపూర్ లో తాగునీటి స‌మ‌స్య‌
X

దిశ, కొల్లాపూర్ (కో డేర్): కోడే ర్ మండలం రాజాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. సోమవారం నుంచి గ్రామ ప్రజలు తాగు నీటి కోసం పడని పాట్లు పడుతున్నారు. బిందెలతో వ్యవసాయ బావులకు వెళుతున్నారు. కొందరు సొంత ట్రాక్టర్లతో నీటిని తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వృద్ధుల పరిస్థితి ఇంకా దారుణంగా త‌యారైంది. మిషన్లు చెడిపోయాయని, చిన్నచిన్న పైపులైన్లు రిపేర్లు ఉన్నాయని, కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ నీటి సమస్యను నియంత్రించాలని ప్రజలు కోరుచున్నారు.

Next Story