- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాల్వ్ నిర్వహణ కారణంగా మహమ్మదాబాద్, గండీడ్ మండలాల్లో తాగునీటి అంతరాయం
మహబూబ్‌నగర్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మహమ్మదాబాద్, గండీడ్ మండలాల్లోని గ్రామాలకు జనవరి 7 నుంచి జనవరి 11 వరకు మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు మిషన్ భగీరథ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ తెలిపారు.

దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మహమ్మదాబాద్, గండీడ్ మండలాల్లోని గ్రామాలకు జనవరి 7 నుంచి జనవరి 11 వరకు మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు మిషన్ భగీరథ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ తెలిపారు. ఎల్లూరు నుంచి గౌరిదేవిపల్లి వద్ద చేపట్టనున్న వాల్వ్ నిర్వహణ పనుల కారణంగా ముడి నీటి సరఫరా నిలిచిపోనున్నదని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కారణంగా మహమ్మదాబాద్, గండీడ్ మండలాల పరిధిలోని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా అందే త్రాగునీటి సరఫరా తాత్కాలికంగా నిలిచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముందుగానే అవసరమైనంత మేరకు నీటిని నిల్వ చేసుకోవాలని, అలాగే నిర్వహణ పనుల సమయంలో సహకరించాలని ఇంజనీర్ సురేష్ కోరారు. వాల్వ్ నిర్వహణ పనులు పూర్తైన వెంటనే యథావిధిగా తాగునీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని ఆయన స్పష్టం చేశారు.






