మంచి నీటిని తాపి పుణ్యం కట్టుకోండి సారు

by Ratna Kumari |

దిశ‌, రేవ‌ల్లి : తమ‌ గ్రామ ప్రజలకు శుద్ధిచేసిన మిషన్ భగీరథ నీళ్లను అందించి రోగాలు ద‌రి చేర‌కుండా పుణ్యం కట్టుకోవాలని మిషన్ భ‌గీర‌థ‌

మంచి నీటిని తాపి పుణ్యం కట్టుకోండి సారు
X

దిశ‌, రేవ‌ల్లి : తమ‌ గ్రామ ప్రజలకు శుద్ధిచేసిన మిషన్ భగీరథ నీళ్లను అందించి రోగాలు ద‌రి చేర‌కుండా పుణ్యం కట్టుకోవాలని మిషన్ భ‌గీర‌థ‌ ఎస్ఈ వెంకట్రామన్ ను రేవల్లి గ్రామప్రజలు కోరారు. శనివారం ఆయన మిషన్ భగీరథ అధికారులతో కలిసి మండలంలోని గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సరఫరా తీరు తెన్నులను ఆయన పరిశీలించారు. రేవల్లి గ్రామంలో గత కొన్నేండ్లు గా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో పంచాయతీ అధికారులు కేవలం బోర్ నీళ్లనే సరఫరా చేస్తున్నారని అరకొరగా మిషన్ భగీరథ నీళ్లు వచ్చినా నల్లాలకు ఉండాల్సిన కంట్రోలింగ్ వాళ్లను తొలగించుకుంటున్నారు. దీంతో అందరికీ మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదని గ్రామస్తులు ఎస్ఈ కి పిర్యాదు చేశారు. పుష్కలంగా కృష్ణ జలాలు ఉన్న గ్రామానికి సమీపంలో మిషన్ భగీరథ మంచినీటి శుద్ధి కేంద్రం ఉండి కూడా గ్రామానికి మంచినీటి సరఫరా అంతరాయాన్ని నివారించాలని గ్రామస్తులు కోరారు. గ్రామానికి కావలసిన శుద్ధి చేసిన మిషన్ భగీరథ నీళ్లను ఉదయం, సాయంత్రం అందిస్తామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి కావాల్సిన మంచినీళ్లను అంతరాయం లేకుండా అందించెందుకు కావాల్సిన చర్యలకు పలు సూచనలు, సలహాలు సిబ్బందికి అందించారు.

Next Story