భారత అణుశక్తి ప్రధాత డాక్టర్ అబ్దుల్ కలాం - ఎమ్మెల్యే మేఘా రెడ్డి

by Ratna Kumari |

దిశ, వనపర్తి : భారత దేశానికి అణుశక్తి సామర్ధ్యాన్ని అందించిన గొప్ప క్షిపణి శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం

భారత అణుశక్తి ప్రధాత డాక్టర్ అబ్దుల్ కలాం - ఎమ్మెల్యే మేఘా రెడ్డి
X

దిశ, వనపర్తి : భారత దేశానికి అణుశక్తి సామర్ధ్యాన్ని అందించిన గొప్ప క్షిపణి శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో )లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గా పనిచేసిన అబ్దుల్ కాలం భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచారని కీర్తించారు.1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.2015 జూలై 27 న షిల్లాంగ్‌లోనీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) లో ఉపన్యాసమిస్తున్న సమయంలో కలాం గుండెపోటుతో మృతి చెందండం బాధాకరం అన్నారు. అబ్దుల్ కలాం సేవలను ఎమ్మెల్యే మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుచీర్ల చందర్, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయ‌కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story