మీసేవా కేంద్రం ప్రాసెసింగ్‌లో అనుమానాలు..!

by Nallavelli.Anjaneyulu |

మీసేవా కేంద్రం ప్రాసెసింగ్‌లో ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ అధికారి పాత్ర కూడా ఉంద‌ని.. విచార‌ణ చేప‌ట్టాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మీసేవా కేంద్రం ప్రాసెసింగ్‌లో అనుమానాలు..!
X

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో గతంలో మద్యం, మాంసం అమ్మిన మీసేవ షాపు ప్రాసెస్ చేస్తున్న కొత్త ఈడియం చెన్నారంలో ఒక మీసేవ అనేక లొకేషన్‌లో నడిపిస్తూ మద్యం, మాంసం అమ్మినందున 2023 సంవత్సరంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ మీ సేవను తనిఖీ చేసి చర్య తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ మీసేవ ఇనాక్టివ్‌లో ఉంది. నడపడం లేదు. ఇప్పుడు ఆ మీ సేవను చెన్నారం మెయిన్ రోడ్డు మీద కొత్తగా వచ్చిన ఈడీఎం వెంకటేష్ ప్రాసెస్ చేసి ఎనేబుల్ చేశారు. ఈ విషయం గురించి ఈడీఎంను అడగ్గా... తను ప్రాసెస్ చేసి వెరిఫికేషన్ చేస్తున్నామని అన్నారు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అందులో రికార్డు పరిశీలించకుండా ప్రాసెస్ అనేది చేశాడని తనే వెల్లడించాడు. మళ్లీ ప్రాసెస్ చేయలేదని తెలుపుతున్నాడు. కావున దీన్నిబట్టి ఆయన స్వలాభం పొందినట్లు తెలుస్తుంది. అధికారులు ఈ విషయంపై విచారణ చేసి సదరు అధికారిపై చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు.

Next Story