డోర్న‌క‌ల్-గ‌ద్వాల రైల్వే లైన్ మంజూరు చేయాలి

by Ratna Kumari |

గత 75 సంవత్సరాలుగా రైల్వే లైన్ నోచుకోని దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి డోర్నకల్ - గద్వాల రైల్వే లైన్ మంజూరు చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు.

డోర్న‌క‌ల్-గ‌ద్వాల రైల్వే లైన్ మంజూరు చేయాలి
X

దిశ, వనపర్తి : గత 75 సంవత్సరాలుగా రైల్వే లైన్ నోచుకోని దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి డోర్నకల్ - గద్వాల రైల్వే లైన్ మంజూరు చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు. బుధవారం ఎంపీ మల్లు రవి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షలు శివసేన రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఈ పార్లమెంట్ సమావేశాలలో డోర్నకల్ గద్వాల్ రైల్వే లైన్ కు సంబంధించి పలు పర్యాయాలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి తో రైల్వే శాఖ అధికారులతో ప్రస్తావించి మంజూరు విషయమై కమిటీ ఆమోదం తెలిపి బిల్లును పాస్ చేయాలని కోరారు.


భారత దేశానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంను అనుసంధానం చేసే డోర్నకల్ - గద్వాల రైల్వే లైన్ ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేయడం ద్వారా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ ఫలాలకు చేరువ అవుతుందన్నారు. రాష్ట్ర సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు డోర్నకల్ - గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్, రఫ్ డి.పి.ఆర్ పూర్తి చేశారని స్పష్టం చేశారు. డోర్నకల్ - గద్వాల రైల్వే లైన్ కు సంబంధించి తీర్మానం చేశామని ఎంపీ మల్లు రవి తెలిపారు. 16,17,18 తేదీలలో నిర్వహించబోయే పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపాలని, లేని పక్షంలో పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.

Next Story