ఊరి మధ్య లో వైన్స్ షాపు వద్దు..!

by Ratna Kumari |

దిశ, పెంట్లవెల్లి : తెలంగాణలో డిసెంబర్ 01 నుంచి నూతన మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో పెంట్లవెల్లి మండల కేంద్రంలో మాత్రం కొత్త మద్యం

ఊరి మధ్య లో వైన్స్ షాపు వద్దు..!
X

దిశ, పెంట్లవెల్లి : తెలంగాణలో డిసెంబర్ 01 నుంచి నూతన మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో పెంట్లవెల్లి మండల కేంద్రంలో మాత్రం కొత్త మద్యం షాపులను ఏర్పాటు చేయ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు. ముఖ్యంగా ఊరి మ‌ధ్య‌లో ప్రజల మద్దతు కోసం అదే గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మూలే మేఘరాజ్ శనివారం ప్రజా భిప్రాయ సేకరణ కోసం సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంలో ప్రజల కు ఇబ్బందికరంగా ఊరి మధ్య లో వైన్స్ షాపులు ఉండకుండా గ్రామానికి దూరం గా ఉండేలా చూడాలని సామాజిక సామాజిక కార్యకర్త మూలే మేఘరాజ్ ప్రజల శ్రేయోస్సు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజా అభిప్రాయ సంతకాల సేకరణ కు ఫ్లెక్సీని కొత్త బస్టాండ్ ప్రాంతంలోనూ, గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలకున్న గ్రామ పౌరులు గ్రామ ప్రజలు అందరు స్వచందంగా సంతకాల సేకరణలో పాల్గొని సపలీ కృతం చేయాలని ఆయన గ్రామం లో ప్రచారం చేపట్టారు. గ్రామం లో ప్లెక్సీ ని ఏర్పాటు చేసి దాన్ని పై ప్రజల తో సంతకాలను చేపట్టారు. ప్ర‌జ‌ల నుంచి కూడా సంత‌కాల సేక‌ర‌ణ‌కు స్పంద‌న ల‌భిస్తోంది.

Next Story