- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దు : ఎస్పీ జానకి
బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ జానకి సంబంధిత అధికారులకు సూచించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ జానకి సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి మొత్తం 19 మంది బాధితులు తమ సమస్యల అర్జీలను నేరుగా ఎస్పీకి అందజేశారు. ప్రతి ఫిర్యాదును ఆమె క్షుణ్ణంగా పరిశీలించి, అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని, కొన్ని అంశాలపై ఆమె స్వయంగా సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై పరిష్కారానికి నేరుగా సంబంధింత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందించవచ్చని, పరిష్కారంలో జాప్యం ఉండదని ఆమె భరోసా నిచ్చారు. ప్రజల సమస్యలకు సమయానికి స్పందించడం ద్వారా పోలీస్ శాఖపై విశ్వాసం మరింత బలపడుతుందని, ఫిర్యాదుదారులకు ప్రాధాన్యత ఇవ్వడం తమ విధి అని, పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి పాటించాలని ఎస్పీ జానకి అధికారులకు సూచించారు.






