- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రక్తదానం చేస్తే ప్రాణాన్ని నిలిపినట్లే : పీ.ఆర్. భాస్కర్ రెడ్డి
రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలిపినట్టేనని హెట్రో ఫార్ము లేషన్ డైరెక్టర్ డాక్టర్ పీ.ఆర్. భాస్కర్ రెడ్డి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలిపినట్టేనని హెట్రో ఫార్ము లేషన్ డైరెక్టర్ డాక్టర్ పీ.ఆర్. భాస్కర్ రెడ్డి అన్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గురువారం పోలేపల్లి సెజ్ లోని 'హెట్రో ఫార్మ' లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. రక్తదానం ఎంతో విలువైనదని, రక్తం కావాల్సిన వారి ప్రాణాలను సైతం నిలపడమే కాకుండా, దానమిచ్చిన వారి ఆరోగ్యానికి కూడా లాభమన్నారు. రెడ్ క్రాస్ చైర్మెన్ నటరాజ్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడంతో, ప్రమాదాలు జరిగి వారికి, తలసేమియా బాధితులు, ప్రసవించే మహిళలు, రక్తహినత లాంటి వారిని ఆదుకున్న వారవుతారని, తరచూ రక్తదానం చేయాలని ఆయన సూచించారు. అనంతరం డాక్టర్ పీ.ఆర్.భాస్కర్ రెడ్డి కి 'సేవా అవార్డు' ను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ హెడ్ డాక్టర్ బి.రామకృష్ణ, డీజీ ఎండీ ఫణి రాజా కిరణ్, నిత్యానంద్ గౌడ్, అశ్విని చంద్రశేఖర్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.






