- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు తినడం దారుణం : ఎంపీ డీకే అరుణ
జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు తినడం దారుణం : ఎంపీ డీకే అరుణ
by Ratna Kumari |
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చి వేయడంపై చూపుతున్న శ్రద్ధను వైద్య సేవలు అందించడంలో చూపడం లేదు అని మహబూబ్ నగర్ ఎంపీ డీజే అరుణ ఆరోపించారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చి వేయడంపై చూపుతున్న శ్రద్ధను వైద్య సేవలు అందించడంలో చూపడం లేదు అని మహబూబ్ నగర్ ఎంపీ డీజే అరుణ ఆరోపించారు. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు తినడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇన్ చార్జిగా ఉన్న జిల్లాలో మృత దేహాన్ని కుక్కలు పీక్కు తినడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు అని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల దయనీయ పరిస్థితులకు ఈ సంఘటన నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చివేయడం పై పెడుతున్న దృష్టిని విద్య, వైద్య ఆరోగ్య సేవలపై పెట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు.
Next Story






