- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారులపై కుక్కల దాడులు.. పట్టించుకోని అధికారులు..!
దిశ, ఊట్కూర్ : రోజు రోజుకు కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అభం, శుభం తెలియని అమాయక చిన్నారులు కుక్కకాటు బారిన పడుతున్నారు. ఈ మధ్య

దిశ, ఊట్కూర్ : రోజు రోజుకు కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అభం, శుభం తెలియని అమాయక చిన్నారులు కుక్కకాటు బారిన పడుతున్నారు. ఈ మధ్య కాలంలో నిత్యం కుక్క కాటు ఘటనలు చాలా ఎక్కువగా చోటు చేసుకోవడం గమనార్హం. తాజాగా మండల కేంద్రంలోని శ్రీనివాసకాలనీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆదివారం ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారులు విశ్వ ఆద్విత్, రాకేష్, రవి తో పాటు పలువురు చిన్నారులను కుక్కలు గాయపరిచాయి. ఈ చిన్నారులు ఏడవటం చూసి చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని కుక్కలని తరిమికొట్టారు. చికిత్స కొరకు చిన్నారులను అప్పంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గత కొద్ది నెలలుగా మనుషులు, పశువులు, గేదెలను కుక్కలు కరుస్తున్నాయి. ఇప్పటికైనా వెటర్నరీ అధికారులు పట్టించుకొని కుక్కలకు ఇంజెక్షన్లు వేయాలని.. కాటు వేసే కుక్కలను దూర ప్రాంతాల్లో వదిలివేయాలని స్థానికులు కోరుతున్నారు.






