ఉపాధి హామీ పథకం పేరు మార్చొద్దు : కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.నరసింహ

by Ratna Kumari |

దిశ, కందనూల్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చే చర్యను తక్షణమే ఉపసంహరించుకోవాలని

ఉపాధి హామీ పథకం పేరు మార్చొద్దు :  కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.నరసింహ
X

దిశ, కందనూల్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చే చర్యను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి పి. నరసింహ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూలీలకు ఇవ్వాల్సిన రోజువారీ కనీస వేతనాన్ని రూ.600గా నిర్ణయించాలని కోరారు. గ్రామీణ పేదలకు స్థానికంగా ఉపాధి కల్పించాల్సిన ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత చర్యలు చేపడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పథక నిబంధనలను తుంగలో తొక్కి గ్రామీణ పేదలను పని లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో రోజు కూలీని కేవలం రూ.274గా నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు నెలకు రూ.2.50 లక్షల వరకు జీతాలు పొందుతున్నప్పుడు, భూమిపై కష్టపడి పని చేసి ఆహార ఉత్పత్తి చేసే వ్యవసాయ కూలీలకు కనీసంగా రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు చేయడంలో ఉన్న అంతరార్థం ఏమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు స్థానికంగా పని కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరానికి 200 పని దినాలుగా పెంచి, రోజుకూలీని రూ.600గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

Next Story