- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదిరెడ్డి పల్లి లో దళితులకు ఆత్మగౌరవం దక్కెనా..?
దిశ, నాగర్ కర్నూల్ /తాడూర్ : నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డి పల్లి గ్రామంలో దళితులకు ఈ సర్పంచ్ ఎన్నికల్లోనైనా ఆత్మగౌరవం దక్కుతుందా..? అనే ప్రశ్నలు

దిశ, నాగర్ కర్నూల్ /తాడూర్ : నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డి పల్లి గ్రామంలో దళితులకు ఈ సర్పంచ్ ఎన్నికల్లోనైనా ఆత్మగౌరవం దక్కుతుందా..? అనే ప్రశ్నలు గ్రామంలో వినిపిస్తున్నాయి. గత కొన్ని ఏండ్లు గా దళితులను ఏ ఒక్క సర్పంచ్ అభ్యర్థి పట్టించుకోలేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ గ్రామంలో ముఖ్యంగా ఇప్పటికీ కూడా దళితులను గ్రామ గుడిలోకి రానివ్వడం లేదు. పీర్ల పండుగలో దళితులను అలావు దుంకకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు చర్చించిన సంబంధిత కులస్తులు ఒప్పుకోలేదు. గతంలో ఈ విషయంపై గొడవలు కూడా జరిగాయి.ఇప్పటివరకు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం లేకపోవడం గమనార్హం.అంబేద్కర్ విగ్రహం గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేయాలని కృషి చేసిన దళితులపై గత ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోనైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అవుతుందా అన్న సందేహం గ్రామాల్లో నెలకొన్నది. నూతనంగా ఎన్నిక అయ్యే సర్పంచ్ అభ్యర్థులకు ఈ విషయాలు దృష్టిలో ఉన్నాయా అని గ్రామంలో పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీలకే విలువిస్తారా..? గ్రామ సమస్యలు,ప్రజల సమస్యలు పట్టించుకుంటారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇట్లాంటి సమస్యలు గాలికి వదిలేసి యువతను మత్తులోకి దింపి ఓట్లాడిగేందుకు ఇరు పార్టీలు సిద్ధమయ్యాయని గ్రామస్తులు అంటున్నారు.






