- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షయ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలి : DMHO
దిశ, గద్వాల క్రైమ్ : క్షయ వ్యాధి పట్ల సమాజంలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని DMHO డాక్టర్ ఎస్.కె. సిద్ధప్ప పేర్కొన్నారు. ఓల్డ్

దిశ, గద్వాల క్రైమ్ : క్షయ వ్యాధి పట్ల సమాజంలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని DMHO డాక్టర్ ఎస్.కె. సిద్ధప్ప పేర్కొన్నారు. ఓల్డ్ డీఎంఅండ్ హెచ్ఓ కార్యాలయంలో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ భాగంగా టీబీ బాధితులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సిద్దప్ప మాట్లాడుతూ ట్రీట్మెంట్ తో పాటు పౌష్టికాహారం ఎంతో కీలకమైనదని, సరైన ఆహారం తీసుకుంటే టీబీపై విజయం సాధించడం సాధ్యమని వివరించారు. క్షయ వ్యాధి ఎక్కువగా పేద ప్రజలకు సోకుతుంది. అందుకే పేద టీబీ బాధితులను గుర్తించి ప్రతి నెలా ఆరు నెలల పాటు న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నాం. జిల్లాలోని దాతలు ముందుకు వచ్చి టీబీ రోగులను దత్తత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎన్.సీ.డి. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంధ్య కిరణ్ మయి, డాక్టర్ జి. రాజు (టీబీ ప్రోగ్రాం ఆఫీసర్), డాక్టర్ మాధుర్య, హనుమంతు (టీబీ నోడల్ పర్సన్), NTEP స్టాఫ్, ASHA వర్కర్స్ పాల్గొన్నారు.






