సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి : జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్

by Ratna Kumari |   (  Updated:2025-11-07 13:21:16  IST  )

దిశ, కొల్లాపూర్ : భారత గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుని డిసెంబర్ 26 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సంద‌ర్భంలో

సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి : జిల్లా కార్యదర్శి  ఎస్ఎండీ ఫయాజ్
X

దిశ, కొల్లాపూర్ : భారత గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుని డిసెంబర్ 26 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సంద‌ర్భంలో శతాబ్ది ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్య లో తరలివచ్చి విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా సీపీఐ కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన నాయ‌కుల‌తో విలేకర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఫయాజ్ మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని, ఆ రోజుల్లోనే సీపీఐ బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం సీపీఐ పై నిషేధం విధించి సీపీఐ నాయకులు జైలులో అజ్ఞాతవాసాల్లో ఉండి కూడా స్వాతంత్ర ఉద్యమాన్ని కొనసాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిర్వహించడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ పోరాటంలో 4500 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన తెలంగాణను నైజాం నవాబు నుండి విముక్తి చేసుకొని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగిందని ఫయాజ్ గుర్తు చేశారు.

ఈ పోరాట ఫలితంగా దున్నేవాడికి భూమి కావాలనే నినాదంతో ముందుకెళ్లిన భారత కమ్యూనిస్టు పార్టీ 10 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. యూపీఏ -1 ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించి ఈ దేశంలో పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని, సమాచారపు హక్కు చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు అధికారంలో లేకున్నా నిరంతరం పేద ప్రజల పక్షాన నిత్యం పోరాటాల ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మెడలు వంచి పేదలకు దక్కవల్సిన ప్రజా సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో సిపిఐ అగ్రభాగం లో ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న లక్షలాది మందితో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు మండల మొలచింతలపల్లి శాఖ కార్యదర్శి జంగం శివుడు సింగోటం శాఖా కార్యదర్శి చంద్రయ్య, తిర్నాంపల్లి శాఖ కార్యదర్శి వెంకటస్వామి రామకృష్ణ శివ, రామకృష్ణ పాల్గొన్నారు.

Next Story