సమాజానికి సేవ చేసే జర్నలిస్టులకు ఆరోగ్యం ఎంతో ముఖ్యం

by velandi.Saikiran |

సమాజానికి సేవ చేసే జర్నలిస్టులకు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్

సమాజానికి సేవ చేసే జర్నలిస్టులకు ఆరోగ్యం ఎంతో ముఖ్యం
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: సమాజానికి సేవ చేసే జర్నలిస్టులకు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐజేయూ) ఆధ్వర్యంలో నారాయణపేట లైన్స్ క్లబ్, హైదరాబాద్ మలక్ పేట్ యశోద హాస్పిటల్, శ్రీ నేత్రా సనత్ నగర్ వారి సహకారంతో లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట వారి సౌజన్యంతో ఎస్.ఆర్. గార్డెన్ లో శనివారం జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జర్నలిస్టు వృత్తి సమాజంలో ఎంతో బాధ్యతయుతమైనదని, ప్రజల సమస్యలను పరిష్కరింప చేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమని, అలాంటి జర్నలిస్టులు ప్రజలకు సేవ చేయాలంటే ఆరోగ్యం ముఖ్యమని తెలిపారు. మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన ఐజేయూ యూనియన్ సభ్యులను కలెక్టర్ అభినందించారు. ముఖ్యంగా గుండె కు సంబంధించిన పరీక్షలు తప్పక చేసుకోవాలన్నారు. జర్నలిస్టులు ప్రజల కోసం సేవ చేయాలంటే ముందు వారికి ఆరోగ్యమే ప్రధానం అన్నారు.

శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని జర్నలిస్టులు నికార్సైన వార్తలు ఇవ్వాలని తెలిపారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ...జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, శరీరం కూడా ఒక ఆర్గానిక్ యంత్రం లాంటిదని, దానికి పరీక్షలు అవసరమన్నారు. ఈసీజీ, టు డీ ఇకో, రక్త పరీక్షల లాంటి బేసిక్ పారామీటర్స్ చూసుకోవాలన్నారు. ఒత్తిడితో కూడిన ఈ వృత్తిలో ఆహారపు అలవాట్లు, దినచర్య అలవర్చుకోవాలని కోరారు. యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, యశోద ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ.. ఒకప్పటి జర్నలిజానికి, నేటి జర్నలిజానికి చాలా మార్పు వచ్చిందని, పోటీ తత్వం పెరిగిందని తెలిపారు.

జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ సూచన మేరకు నారాయణపేటలో యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియా ప్రాబల్యం ఎక్కువైందని నిజా నిజాలు తెలియకుండా వార్తలను వ్యాప్తి చేస్తున్నారన్నారు. జర్నలిజం నైతిక విలువలను కాపాడుకునేందుకు వచ్చే నెల జిల్లాలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులను నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.శిబిరంలో మొత్తం 350 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. శిబిరానికి సహకరించిన లయన్స్ క్లబ్ నారాయణపేట సభ్యులకు, మలక్ పేట్ యశోద ఆస్పత్రి యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిపిఆర్ఓ ఎంఏ రషీద్, టి యు డబ్ల్యూ జే ఐజే యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోయిలకొండ నారాయణరెడ్డి, శివశంకర్, లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ హరి నారాయణ బట్టాడ్, పట్టణ అధ్యక్షుడు రవికుమార్ గౌడ్, సభ్యులు కన్న జగదీష్, శ్రీనివాస్ లాహోటి, సాయికుమార్, ఎస్ ఐ వెంకటేశ్వర్లు, వైద్య విభాగ కన్వీనర్ గద్వాల సంజీవ్ కుమార్, సభ్యులు నక్క శ్రీనివాస్, గణప రఘు, రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Next Story