- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం గద్వాల మండలం గోనుపాడు గ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు విభాగాలను పరిశీలించి, తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తీసుకున్న వివిధ కోర్సులు, వారి భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగారు. వివిధ ల్యాబ్ లను సందర్శించి విద్యార్థులకు అర్థమయ్యేలా శిక్షణ ఇవ్వాలని, అవసరమైన సెమినార్లు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని అక్కడి అధ్యాపకులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గద్వాలలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఉండగా ఈ సంవత్సరం నూతనంగా సైబర్ ఫిజికల్ సిస్టం సెక్యూరిటీ కోర్స్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
పాలిసెట్ కౌన్సిలింగ్ సందర్భంగా ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులు కొత్త కోర్సులోకి మారేందుకు అవకాశం ఉందన్నారు. ఇటీవల పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు కూడా ఈ కళాశాలలో చేరేందుకు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా అవకాశం ఉంటుందన్నారు. వడ్డేపల్లి లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ప్రతి కోర్సులో 60 సీట్లు ఉంటాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి కళాశాలలో చేరిన విద్యార్థులు గద్వాలలోని పలు వసతి గృహాల్లో ఉన్నందున వారు కళాశాలకు వెళ్లి వచ్చేందుకు ఇబ్బంది లేకుండా బస్సులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సమీపంలోని గద్వాల మండలానికి చెందిన కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు.
కొత్త విద్యార్థుల అడ్మిషన్స్ గురించి అడిగి, నిబంధనల ప్రకారం విద్యార్థులను చేర్చుకోవాలన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు రోజులవుతున్న విద్యార్థులు పూర్తిస్థాయిలో విద్యాలయానికి రాకపోవడమేమిటిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. మెనూ ప్రకారం భోజనం వండించాలని అక్కడి ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం కస్తూర్బా విద్యాలయ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో డీఈవో విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారి జ్యోతి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్, కస్తూర్బా విద్యాలయ ప్రత్యేక అధికారిణి గోపీలత, తదితరులున్నారు.






