- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: దేశంలో నకిలీ లాయర్లకు ఇక చెక్.. సుప్రీంకోర్టు విప్లవాత్మక నిర్ణయం
దేశంలో నకిలీ లాయర్లకు చెక్ పెట్టేందుకు ప్రతి న్యాయవాదికి ఓ జాతీయ ‘యూనిక్ ఐడీ’, డిజిటల్ రిజిస్ట్రీని తీసుకురావాలన్న పిటిషన్‌పై కేంద్రం, బార్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నకిలీ లాయర్ల (Fake Lawyers) చలామణికి అడ్డుకట్ట వేసేందుకు, నిజమైన న్యాయవాదులను సులభంగా గుర్తించేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జాతీయ స్థాయి డిజిటల్ రిజిస్ట్రీ, ప్రతి లాయర్‌కు ఓ యూనిక్ నేషనల్ అడ్వకేట్ ఐడెంటిఫైయర్ (Unique National Advocate ID)ని తీసుకురావాలన్న పిటిషన్‌పై అత్యున్న ధర్మాసనం కీలక అడుగు వేసింది. బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) దాఖలు చేసిన పిల్‌పై ఇవాళ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ప్రతిపాదన చాలా వినూత్నంగా ఉందని, టెక్నాలజీ సహాయంతో దీనిని అమలు చేయవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
దేశంలో 18 లక్షల మంది లాయర్లు..
విచారణ సందర్భంగా దేశంలో ప్రస్తుతం దాదాపు 18 లక్షల మంది రిజిస్టర్డ్ నమోదిత న్యాయవాదులు ఉన్నారని పిటిషనర్ తెలిపారు. అయితే, ఒక వ్యక్తి నిజంగానే లాయరా.. అతడి విద్యార్హతలు ఏంటి? అనే వివరాలను తక్షణమే (Real-time) ధృవీకరించుకోవడానికి దేశవ్యాప్తంగా ఎలాంటి సరైన పబ్లిక్ రికార్డు లేదు. ప్రస్తుతం దేశంలోని 23 రాష్ట్రాల బార్ కౌన్సిల్‌లలో వేర్వేరుగా రికార్డులు ఉండటం వల్ల ఏకీకృత ప్రమాణాలు లేవని, దీంతో నకిలీ లాయర్లు సులభంగా చట్టం కళ్లగప్పి తిరుగుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే, ఈ డిజిటల్ రిజిస్ట్రీ ద్వారా రిజిస్టర్ అయి ప్రతి న్యాయవాదికి ఓ స్పెషల్ ఐడీ, వారి విద్యార్హతలు, ప్రస్తుత ఎన్‌రోల్‌మెంట్ స్టేటస్, డిసిప్లినరీ రికార్డులతో కూడిన ‘క్యూఆర్ వెరిఫైయబుల్ ప్రొఫైల్’(QR-verifiable profile)ను అందుబాటులోకి తీసుకురావాలని పిటిషనర్ కోరారు. దీంతో కోర్టులు, క్లయింట్లు ఎవరైనా సరే లాయర్ల ఐడీని సులభంగా స్కాన్ చేసి నిజానిజాలు స్పాట్‌లో తెలుసుకోవచ్చిన పిటిషనర్ తన వాదనలు విపించారు. అయితే, ఈ ప్రాజెక్టును జాతీయ రూల్ ఆఫ్ లా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌గా గుర్తించి, కేంద్ర న్యాయశాఖ నిధులు కేటాయించాలని, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ పర్యవేక్షణ కమిటీని నియమించాలని పిటిషనర్ కోరారు.
అసభ్యకర కామెంట్లపై ధర్మాసనం సీరియస్..
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (CJI) స్పందిస్తూ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో న్యాయవ్యవస్థపై వస్తున్న కొన్ని అసభ్యకరమైన కామెంట్లు, స్టేట్‌మెంట్లు తాము చూశామని అన్నారు. నిజమైన ప్రొఫెషన్‌లో ఉన్నవారు ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడరని కామెంట్ చేవారు. వృత్తిని కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు అసలు న్యాయవాదులే అయి ఉండకపోవచ్చని ఫైర్ అయ్యారు.






