- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానాకాలం వ్యాధులు..జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్, వాంతులు, విరోచనాలు టైఫాయిడ్ మొదలగు వ్యాధుల నియంత్రణ చర్య లపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ అంశాలపై అన్ని శాఖల అధికారులతో చర్చించారు. సమావేశంలో ముందుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కే. జయ చంద్ర మోహన్ కార్యక్రమం ఉద్దేశ్యాన్ని జిల్లా అధికారులకు తెలపగా, ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీకాంత్ ఈ కార్యక్రమం మొత్తం వివరాలను పి.పి.టి. ద్వారా అన్ని శాఖల అధికారులకు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిరంతరంగా డ్రైడే ఆక్టివిటీస్ నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ, ప్రతి మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ సర్వీలెన్స్ నిర్వహించాలని శానిటేషన్ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే విద్యార్థులకు పాఠశాలల్లో , హాస్టళ్లలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో డీ ఆర్డీ ఏ/ డిపివో వెంకట్ రాములు, డీ డబ్ల్యు ఓ రాజేందర్ గౌడ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, మిషన్ భగీరథ ఈ ఈ రంగారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి రెహమాన్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, మున్సిపల్ కమిషనర్లు శంకర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.






