అంగ‌న్ వాడి చిన్నారుల‌కు యూనిఫాంల పంపిణీ

by Ratna Kumari |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మ మాట- అంగన్‌వాడి బాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు అంగన్‌వాడి కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.

అంగ‌న్ వాడి చిన్నారుల‌కు యూనిఫాంల పంపిణీ
X

దిశ‌, ఊట్కూర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మ మాట- అంగన్‌వాడి బాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు అంగన్‌వాడి కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. ఊట్కూర్ గ్రామంలో సర్పంచ్ రేణుక, పెద్దజేట్రం గ్రామంలో సర్పంచ్ వాకిటి వెంకటేష్, చిన్నపోర్ల గ్రామంలో సర్పంచ్ నిఖిత, కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ నర్సింహులు తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు చిన్నారులకు యూనిఫాంలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడి కేంద్రాలు చిన్నారుల విద్య, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసానికి తొలి మెట్టుగా నిలుస్తాయని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం, ప్రాథమిక విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్‌వాడి కేంద్రాలకు పంపించి ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్‌వాడి టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story