ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల బ‌లోపేతానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి : సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్

by Ratna Kumari |

విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల బ‌లోపేతానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి : సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మిడ్జిల్ : విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని దోనూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో చదువుతున్న 66 మంది విద్యార్థులకు తన సొంత నిధుల తో స్పోర్ట్స్ డ్రస్సులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలలో నేడు విద్యాబోధన ఎంతో నాణ్యతగా అందుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించే విధంగా ఆలోచన చేయాలని కోరారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలల కన్నా ప్రభుత్వ బడులు తక్కువేమి కాదని నిరూపించాలని సూచించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ బడుల బలోపేతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహకరించాలని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. విద్యార్థుల కోసం తనవంతు సహాయ సహకారాలు అందించానని, పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు సర్పంచ్ తన సొంత నిధులతో స్పోర్ట్స్ డ్రెస్ అందజేసినందుకు మండల విద్యాధికారి సరస్వతితోపాటు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తారాసింగ్, పాఠశాల కమిటీ చైర్మన్ జగదీశ్వరి, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, కృష్ణ నాయక్, అంజమ్మ, వార్డు సభ్యులు ఆంజనేయులు , సుధాకర్ రెడ్డి, రవి, జగ్గయ్య, పరశురాములు పాల్గొన్నారు.

Next Story