విద్యార్థినికి సైకిల్ విత‌ర‌ణ‌.. మాన‌వ‌త్వం చాటుకున్న ఎస్సై శ్రీనివాస్

by Nallavelli.Anjaneyulu |

విద్యార్థినికి సైకిల్ కొనిచ్చి ఎస్సై శ్రీనివాస్ మాన‌వ‌త్వం చాటుకున్నారు.

విద్యార్థినికి సైకిల్ విత‌ర‌ణ‌.. మాన‌వ‌త్వం చాటుకున్న ఎస్సై శ్రీనివాస్
X

దిశ‌, పాన్ గ‌ల్ : మండల పరిధిలోని గోప్లా పూర్ గ్రామానికి చెందిన వట్టెల అక్షయ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల లో 8 వ తరగతి చదువుతుంది. ప్రతిరోజు గ్రామం నుంచి సైకిల్ పై పాన్ గల్ కు వచ్చి వెళ్ళేది. డిసెంబర్ 30న పాఠశాల కు వచ్చిన విద్యార్థిని ప్రతి రోజు సైకిల్ పార్క్ చేసే చోట పెట్టి పాఠశాల కు వెళ్ళింది. సాయంత్రం వచ్చి చూడగా.. అక్కడ సైకిల్ కనిపించ‌క‌పోవ‌డంతో ఏడుచు కుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా సైకిల్ గుర్తు తెలియని వ్యక్తి దొంగి లించా రని ఎస్సైకి ఫిర్యాదు చేసింది. విద్యార్థిని కంట తడి తో చలించిన ఎస్సై శ్రీనివాస్ తాను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో తన సొంత ఖర్చులతో సైకిల్ కొనుగోలు చేసి బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆ గ్రామ సర్పంచ్ రాజేందర్ గౌడ్, నాయకులు పుల్లారావు సమక్షంలో అందజేశారు. విద్యార్థి ని కుటుంబ సభ్యులు, స్థానికులు ఎ స్సై చాటుకున్న మానవత్వంను ప్రశంసించి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప స‌ర్పంచ్ బాల‌కృష్ణ పాల్గొన్నారు.

Next Story