తాగునీరు కోసం భక్తుల ఇక్కట్లు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, చిన్న‌చింతకుంట : పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉద్దాల ఉత్సవం అయిపోయిన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రా

తాగునీరు కోసం భక్తుల ఇక్కట్లు
X

దిశ‌, చిన్న‌చింతకుంట : పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉద్దాల ఉత్సవం అయిపోయిన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు శని, ఆదివారాల్లో భారీగా తరలి వస్తున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం మెట్ల మార్గంగా వెళ్లే భక్తులకు తాగునీటి కోసం నల్లాలు ఏర్పాటు చేశారు. నల్లాలో తాగునీరు రాకపోవడంతో చంటి పిల్లలు, తల్లులు వృద్ధులు తాగునీరు లేక దాహార్తి కోసం అల్లాడిపోతున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్న ఆలయ అధికారులు గుట్ట పైకి వెళ్లే భక్తులకు తాగునీరుపై దృష్టి సారించకపోవడం తో అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. వెంటనే గుట్ట పైకి వెళ్లే భక్తులకు తాగునీటి సదుపాయాన్ని కల్పించాలని భక్తుల డిమాండ్ చేస్తున్నారు.

Next Story