- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కబడ్డీ టోర్నమెంట్ లో అపశృతి
అమరవాయి గ్రామంలో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒక క్రీడాకారుడు తీవ్రంగా గాయపడగా, అత్యవసర సేవలు అందించాల్సిన 108 అంబులెన్స్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం కలకలం రేపింది.

దిశ, అలంపూర్ : అమరవాయి గ్రామంలో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒక క్రీడాకారుడు తీవ్రంగా గాయపడగా, అత్యవసర సేవలు అందించాల్సిన 108 అంబులెన్స్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం కలకలం రేపింది. చికిత్స కోసం మానవపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఉన్న 108 సిబ్బంది సెలవులో ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో క్రీడాకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎక్కడైనా ఎమర్జెన్సీ వాహనానికి సెలవు ఉంటదా అని అందరూ అవాక్కయ్యారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన 108 ఎమర్జెన్సీ సేవలు మృత్యుపాశాలుగా మారుతున్నాయా..? అత్యవసర సమయంలో అండగా ఉండాల్సిన అంబులెన్స్ సిబ్బంది బాధ్యతారాహిత్యం ఒక యువ క్రీడాకారుడిని నరకయాతనకు గురిచేసింది. కాలు విరిగి నొప్పితో విలవిల్లాడుతున్నా, "మా సిబ్బంది సెలవులో ఉన్నారు" అంటూ ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాధానం సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో లింగన్ వాయి గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే క్రీడాకారుడు కాలు విరగడంతో మానవపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఉన్న108 అంబులెన్స్ సిబ్బంది లేకపోవడంతో గాయపడ్డ క్రీడాకారుడికి వైద్యం అందలేదు. 40 నిమిషాల పాటు అక్కడే నిల్చుని 108 వాహనం కోసం ఎదురు చూశారు. ఆస్పత్రిలో ఉన్న 108 సిబ్బంది ఎక్కడికి వెళ్లారని ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా లీవ్ లో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ సేవలు అందించే వారికి లీవులు ఎలా ఉంటాయని తోటి క్రీడాకారులు ప్రశ్నించారు. 108 కు ఫ్రీ కాల్ కు ఫోన్ చేస్తే వడ్డేపల్లి నుండి మరో 108 వాహనం రావడంతో గాయపడ్డ గోవర్ధన్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తల్లించారు.
సెలవులు ఎవరికీ ఇవ్వలేదు : 108 జిల్లా కోఆర్డినేటర్
"ఎవరికీ సెలవు ఇవ్వలేదు.. కానీ ఒక గంట పర్మిషన్ ఇచ్చాం" అని ఒకవైపు చెబుతూనే "ఆసుపత్రి సిబ్బంది పొరపాటున సెలవు అని రత్నమయ్యా సమాధానం ఇచ్చారు. ఎవరో ఒకరు డ్యూటీ తప్పనిసరిగా ఉంటారని, ఎవరికీ సెలవు ఇవ్వలేదు అన్నారు. ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది పొరపాటున సెలవు ఉందని చెప్పడం తప్పు అని తెలిపారు. 108 సిబ్బంది ఈఎంటికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వన్ అవర్ పర్మిషన్ ఇచ్చానని, డ్రైవర్ అందుబాటులో ఉన్నాడని తెలిపారు.






