- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'దిశ' కథనం ఎఫెక్ట్.. కొడుకుల వద్దకు చేరుకున్న సత్యమ్మ
మంగళవారం 'దిశ' జిల్లా టాబ్లాయిడ్ లో వచ్చిన 'అయిదేళ్లగా చెట్టు నీడే ఆశ్రయం' కథనానికి అధికారులు వెంటనే స్పందించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మంగళవారం 'దిశ' జిల్లా టాబ్లాయిడ్ లో వచ్చిన 'అయిదేళ్లగా చెట్టు నీడే ఆశ్రయం' కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. విషయం తెలిసిన డిప్యూటీ తహశీల్దార్ దేవేందర్ కెశిరెడ్డి, ఎంఆర్ఐ నర్సింగ్ లు వెంటనే క్రిస్టియన్ కాలనీ కార్పోరేటర్ సిబి పూజిత తో కలిసి సత్యమ్మ ఉంటున్న చెట్టు దగ్గర వెళ్లి ఆమె కలిశారు. కుమారుల ఇళ్లకు వెళ్లి మానవత్వంతో నచ్చజెప్పారు. అయినా వారు ఆమెను చేరదీయడానికి ఇష్టపడకపోవడంతో కన్నతల్లి ని చేరదీయకుంటే '2007-తల్లిదండ్రుల సంరక్షణ చట్టం' ప్రకారం జైలుకు వెళ్ళాల్సివస్తుందని హెచ్చరించి, ఆ తల్లిని కుమారుల చెంతకు చేర్చారు. ఒప్పందం ప్రకారం.. కన్నతల్లి సత్యమ్మను ఒక్కోక్క కొడుకు ఒక నెల పోషించాలని, తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలని బాండు పేపర్ పై రాయించుకున్నది కార్పోరేటర్ పూజిత. చట్టం తోడై, అధికారుల మానవత్వం జత కలవడంతో ఆ వృద్ధురాలి వీధి బతుకు కు తెరపడింది. రోడ్డునపడ్డ కన్నతల్లి పై కథనం రాసి, కొడుకుల చెంతకు చేర్చిన 'దిశ' కు, సహకరించిన అధికారులకు, కార్పొరేటర్ సీబీ పూజిత కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.






