- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. ఎక్సైజ్ శాఖలో ఇద్దరు అధికారుల బదిలీలు
by Ratna Kumari |
దిశ-మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా అబ్కారి పంపకాల పంచాయితి పై ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. మహబూబ్ నగర్ అర్బన్ అధికారిగా పని చేస్తున్న సుష్మా రెడ్డిని అచ్చంపేట్ స్టేషన్ హౌస్

X
దిశ-మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా అబ్కారి పంపకాల పంచాయితి పై ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. మహబూబ్ నగర్ అర్బన్ అధికారిగా పని చేస్తున్న సుష్మా రెడ్డిని అచ్చంపేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా, మహబూబ్ నగర్ రూరల్ అధికారిగా పని చేస్తున్న సుధాకర్ రెడ్డిని కొల్లాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బదీలి చేశారు. ఈ క్రమంలో దిశ కథనాల ఆధారంగా.. చర్యలు తీసుకుంటున్నామని సర్కులర్ జారి చేశారు. దిశ వరస కథనాల నేపథ్యంలో అబ్కారి ఉన్నతాధికారులు సైతం విచారణ నిర్వహించారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడవుతోంది. ఈ క్రమంలో అబ్కారి శాఖలో జరుగుతున్న తంతంగం పై మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఆరా తీసినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అక్రమ వసూళ్ళపై మంత్రి దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని భాదితులు సైతం డిమాండ్ చేస్తున్నారు.
Next Story






