- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. కబ్జా చేసిన భూమిని వదిలే ప్రసక్తే లేదు..!
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గుంటూరు గ్రామానికి సంబంధించిన హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న పుణ్యమూర్తి

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గుంటూరు గ్రామానికి సంబంధించిన హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న పుణ్యమూర్తి సత్యమ్మ పేరున 39 గుంటల వ్యవసాయ భూమి ఉన్నదన్నారు. ఆమె 2012 లో మృతి చెందిందని తనకు సంబంధించిన వారసులు ఎవరు లేకపోవడంతో ఆ విలువైన భూమి పై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కన్నేసి అధికారులను లోపరుచుకొని కోట్ల విలువ చేసే భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై దిశ కథనం ప్రచురితం కావడంతో శనివారం రెవెన్యూ అధికారులు, జిపిఓ రమేష్ బృందం సర్వే అధికారులతో హుటాహుటిన కబ్జా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
39 గుంటల భూమిపై విచారణ..
కోట్లాది విలువగల భూమి కబ్జా విషయంపై విచారణకు వెళ్లిన ఉప్పునుంతల ఆర్ఐ బలరాం ను దిశ ప్రతినిధి వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెల్టూరు గ్రామానికి సంబంధించిన సర్వే నెంబరు 213లో 15 ఎకరాల పై చిలుకు వ్యవసాయ భూమి ఉన్నదని.. అందులో 39 గుంటల పుణ్యమూర్తి- సత్యమ్మ కు సంబంధించిన భూమి పై కొందరు పట్టా చేసుకున్నట్లు ఆధారాలు చూపుతున్నారు. నాలా కన్వర్షన్ కూడా పూర్తి చేసుకుని ప్లాట్లు చేసి అమ్మకాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుందన్నారు. గ్రామస్తులందరూ ఆ స్థలాన్ని వెల్టూరు జిపికి కేటాయించి సంత నిర్వహణ యధావిధిగా అదే ప్రదేశంలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారన్నారు. పూర్తి విచారణ చేపట్టి నివేదిక తాసిల్దార్ కు అందజేస్తామన్నారు.
జిపి కేటాయించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు..
స్వర్గీయ సత్యమ్మ కు సంబంధించిన 39 గుంటల విలువైన భూమిని తనకు వారసులు లేకపోవడంతో ప్రభుత్వ భూమి అవుతుందని, ఆ భూమిని అన్యాక్రాంతంగా తప్పుడు దృవ పత్రాలు సృష్టించి కబ్జా చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని కబ్జాకోరాల నుంచి భూమిని విడిపించి గ్రామపంచాయతీకి కేటాయించేంతవరకు ఊరుకునే ప్రసక్తే లేదని.. అవసరమైతే కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని గ్రామస్తులు దిశకు తెలిపారు.






