దిశ ఎఫెక్ట్: ఆ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

by I. Sairam |

"ప్రభుత్వ పాఠశాలలో పంతుళ్ళు మాయం" అనే దిశ కథనానికి స్పందించిన మండల విద్యాశాఖ అధికారులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు శుక్రవారం ఉప్పునుంతల ఎంఈఓ చంద్రశేఖర్ తెలిపారు.

దిశ ఎఫెక్ట్: ఆ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
X

దిశ, ఉప్పునుంతల: "ప్రభుత్వ పాఠశాలలో పంతుళ్ళు మాయం" అనే దిశ కథనానికి స్పందించిన మండల విద్యాశాఖ అధికారులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు శుక్రవారం ఉప్పునుంతల ఎంఈఓ చంద్రశేఖర్ తెలిపారు. ఉప్పునుంతల మండలంలోని రాయిచేడు గ్రామంలోని ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు లక్ష్మణ్, వెంకట్ రామ్ లు పాఠశాలకు తాళం వేశారని గ్రామస్థుల సమాచారం మేరకు దిశ పరిశీలించి రాసిన కథనానికి స్పందించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. విధులకు హాజరుకాని ఉపాధ్యాయులు ఎవరైనా సరే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతిరోజు ఆన్లైన్ అటెండెన్స్ ఉదయం సాయంత్రం నమోదు కావాలన్నారు. పాఠశాలలో మొబైల్ ఫోన్లు వాడకూడదని కేవలం ఆఫీస్ పని అత్యవసరానికి తప్ప మిగతా టైం లో వాడొద్దన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. ఎంఈఓ తో పాటు వెల్టూరు కాంప్లెక్స్ హెచ్ఎం ఆంజనేయులు ఉన్నారు.

Next Story