- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : ఎట్టకేలకు తెరుచుకున్న రేవల్లి పశువైద్యశాల
by Elthuri vijay kumar |
రేవల్లి మండల కేంద్రంలో మూతబడ్డ పశువైద్యశాల అనే కథనంతో ఆదివారం దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వనపర్తి జిల్లా పశు వైద్యాధికారులు స్పందించారు.

X
దిశ ఎఫెక్ట్ : ఎట్టకేలకు తెరుచుకున్న రేవల్లి పశువైద్యశాల
‘దిశ’ కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు
వైద్యశాలకు తాత్కాలిక సిబ్బంది కేటాయింపు
దిశ, రేవల్లి : రేవల్లి మండల కేంద్రంలో మూతబడ్డ పశువైద్యశాల అనే కథనంతో ఆదివారం దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వనపర్తి జిల్లా పశు వైద్యాధికారులు స్పందించారు. పశువైద్యశాలకు అధికారులు మంగళవారం తాత్కాలిక సిబ్బందిని కేటాయించి పశువైద్యశాలను పునరుద్ధరించి గోర్లు, మేకలు, పశువులకు వైద్య చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు మూతబడ్డ పశువైద్యశాలను పునరుద్ధరించే విధంగా కథనాల ప్రచురించిన దిశకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రంలో ఉండాల్సిన పెద్ద పశువైద్యశాలను, వైద్యుడిని కేటాయించి రైతులకు సౌలభ్యం కల్పించాలని వారి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story






