- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : మూడు గంటల్లోనే స్పందించిన అధికారులు
మృతదేహాన్ని మార్గమధ్యలో దింపేసిన 108సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం - బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తాం : ఐటీడీఏ ఇన్చార్జి పీఓ రోహిత్

దిశ ఎఫెక్ట్ : మూడు గంటల్లోనే స్పందించిన అధికారులు
- జరిగిన ఘటనపై చింతిస్తున్నాం.. ఇకపై పునరావృతం కాకుండా చూస్తాం
- మృతదేహాన్ని మార్గమధ్యలో దింపేసిన 108సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం
- బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తాం : ఐటీడీఏ ఇన్చార్జి పీఓ రోహిత్
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని నల్లమల లోతట్టు ప్రాంతంలోని ఈర్లపెంటకు చెందిన గురువమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో 108 సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ మార్గమధ్యలోనే వదిలిన మానవీయ ఘటన శుక్రవారం దిశ పత్రిక ద్వారా వెలుగులోకి రావడంతో వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ ఇన్చార్జి పీఓ రోహిత్ గోపిడి లేఖ ద్వారా దిశకు తెలిపారు. రోడ్డు మార్గం సరిగా లేకపోవడం వల్ల 108 సిబ్బంది పరహాబాద్ చౌరస్తా వద్ద వదిలివేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం చాలా విచారమని, తద్వారా అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే మృతదేహాన్ని మూడు చక్రాల వాహనం ద్వారా తరలించేలా ఏర్పాటు చేశామని, మృతురాలి అంత్యక్రియలకు ఐటీడీఏ ఆర్థిక సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.






