దిశ ఎఫెక్ట్.. అయ్యప్ప ట్రేడర్ వద్ద విచార‌ణ చేప‌ట్టిన ఏఓ కృష్ణ‌య్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో ఉన్న‌ అయ్యప్ప ట్రేడర్స్ వద్ద గత మూడు రోజుల క్రితం అధిక ధరలకు యూరియా అమ్మకాలపై ఎలిమినేటి

దిశ ఎఫెక్ట్.. అయ్యప్ప ట్రేడర్ వద్ద విచార‌ణ చేప‌ట్టిన ఏఓ కృష్ణ‌య్య
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో ఉన్న‌ అయ్యప్ప ట్రేడర్స్ వద్ద గత మూడు రోజుల క్రితం అధిక ధరలకు యూరియా అమ్మకాలపై ఎలిమినేటి సాయిబాబా అనే రైతు పూర్తి ఆధారాలతో కూడిన రసీదులతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ విషయం స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి శనివారం ఏవో కృష్ణయ్య ఫిర్యాదు రైతుతో పాటు విచారణ చేపట్టారు. ఫర్టిలైజర్ ట్రేడర్ దారుడు మరింత తప్పుదోవ పట్టించేలా ఆ రైతు ఫోర్జరీ సంతకం చేసినట్లు సమాచారం. యూరియా బస్తాతో పాటు మరొక ఐటమ్ కొన్నట్టుగా వారి వద్ద ఉన్న రసీదు పై రాసి రైతు సంస్థ చేసినట్లు తెలుస్తుంది. వ్యవసాయ అధికారి ఈ సంతకం నీదేనా అని అడిగి మరోసారి సంతకం చేయించగా రైతు చేసిన సంతకం కాదని తేటతెల్లమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణ అనంతరం అధికారి పూర్తి సమాచారం తెలిపే అవకాశం ఉంది.

Next Story