స‌బ్సీడీ వేరు శ‌న‌గ విత్త‌నాల పంపిణీ నిలిపివేత

by Nallavelli.Anjaneyulu |

మండలానికి కేటాయించిన సబ్సిడీ వేరు శ‌నగ విత్తనాల కోట పూర్తి అయింది. కాబట్టి ఇక పంపిణీ నిలిపి వేయడం జరిగిందన్నారు.

స‌బ్సీడీ వేరు శ‌న‌గ విత్త‌నాల పంపిణీ నిలిపివేత
X

దిశ‌, పాన్ గ‌ల్ : నూనె గింజ‌ల ఉత్ప‌త్తి పెంపొందించ‌డంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 100 శాతం రాయితీ తో వేరు శనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేసిన‌ట్టు మండల వ్యవసాయ అధికారి మనిచందర్ తెలిపారు మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. NMEOS పథకం ద్వారా అక్టోబ‌ర్ 14 నుంచి వేరుశనగ విత్తనాలను విడతల వారిగా రైతులకు పంపిణీ చేసిన‌ట్టు తెలిపారు. మండలానికి 1250 క్వింటాల వేరుశనగ విత్తనాలు మంజూరు కాగా మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో సుమారుగా 1360 మంది రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. మండలానికి కేటాయించిన సబ్సిడీ వేరు శ‌నగ విత్తనాల కోట పూర్తి అయింది. కాబట్టి ఇక పంపిణీ నిలిపి వేయడం జరిగిందన్నారు. రైతులు సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం రైతు వేదిక వద్దకు రావాల్సిన అవసరం లేదని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలను లబ్ధి పొందిన రైతుల వివరాలను రెండు రోజుల్లో ఆయా క్లస్టర్ల పరిధిలో రైతు వేదికల వద్ద ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఇతరుల మాటలు నమ్మి రైతులు విత్తనాలను పంపిణీ చేస్తున్నారని తెలిపిన మీ వ్యవసాయ పనులను వదులుకొని కార్యాలయాల వద్దకు తిరుగవద్దన్నారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే ఆయా క్లస్టర్ల పరిధిలోని ఏఈఓ ల ద్వారా సమాచారాన్ని గ్రామాల వారిగా రైతులకు తెలియపరుస్తామని ఆయన తెలిపారు. 50 శాతం రాయితీతో మినుము విత్తనాలను 4 కేజీ ల బస్తాకు 380 రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని.. కావాల్సిన‌ రైతులు తీసుకువెళ్లొచ్చ‌ని ఆయ‌న తెలిపారు. ఈ సమావేశంలో ఏఈఓ లు శైలజ,నరేష్,అఖిల ఉన్నారు..

Next Story