- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తి అదృశ్యం
దిశ, నవాబుపేట : మండల పరిధిలోని లోకిరేవు గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్ఐ విక్రమ్ తెలిపిన ప్రకారం..

X
దిశ, నవాబుపేట : మండల పరిధిలోని లోకిరేవు గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్ఐ విక్రమ్ తెలిపిన ప్రకారం.. తెలుగు శ్రీను అనే వ్యక్తి ఈనెల 20వ తేది నుంచి కనిపించకుండా పోయాడని ఆయన భార్య జంగమ్మ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిరోజు మాదిరిగానే 20వ తేదీ కూలి పనులకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన శ్రీను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆయన కోసం చుట్టుపక్కల బంధువుల దగ్గర ఎంతగానో వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో తన భర్త ఆచూకీ కనుక్కోవాలని కోరుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.
Next Story






