- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు పాటించాలి : డీఐజీ L.S. చౌహన్
దిశ, అచ్చంపేట : ప్రజలకు శాంతి భద్రత విషయంలో ఎక్కడ నెమర పాటు లేకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించరాదని జోగులాంబ రేంజ్

దిశ, అచ్చంపేట : ప్రజలకు శాంతి భద్రత విషయంలో ఎక్కడ నెమర పాటు లేకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించరాదని జోగులాంబ రేంజ్ డీఐజీ L.S. చౌహన్ పోలీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డిఎస్పి, సీఐ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నేరాలు, క్రైమ్, ఇతర కేసులకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులకు ఎక్కడ తావివ్వకుండా అన్యాయానికి సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు. ప్రజలకు మరింత భరోసా కల్పించేలా స్నేహ పూర్వకమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ప్రజల నుండి మన్ననలను పొందాలని సూచించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతమైన అమ్రాబాద్ సర్కిల్ పరిధిలోని కేసులపై సీఐ శంకర్ ద్వారా ఆరా తీశారు. ఈ సందర్భంగా అచ్చంపేటకు వచ్చిన డి ఐ జి కి పూల కుండితో డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సిఐ లు నాగరాజు, శంకర్ లు అందజేస్తూ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే అచ్చంపేటలో సందర్శించారు. ఈ సందర్భంగా అచ్చంపేట, అమ్రాబాద్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో శాంతి భద్రతలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.






