రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పేదలకు ఇబ్బందులు

by Ratna Kumari |

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్వే లైన్ పనుల్లో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పేదలు ఇండ్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పేదలకు ఇబ్బందులు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్వే లైన్ పనుల్లో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పేదలు ఇండ్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పట్టణంలో డబుల్ రైల్వే లైన్ పనుల్లో ఇండ్లు కోల్పోతున్న బాధితులను ఆయన శనివారం పరామ‌ర్శించి మీడియాతో మాట్లాడారు. డబుల్ లైన్ ఏర్పాటుకు రెండు వైపులా 9 మీటర్ల దూరంలో స్థలం తీసుకుంటే సమస్యలేదని, అలాకాకుండా ఒకవైపు ఎక్కువ, మరోవైపు తక్కువ స్థలం తీసుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పొద్దున్నే లేచి వ్యాపారం చేసుకునే వారికి, పేదలు ఇండ్లలోకి వెళ్లకుండా మార్గాలు మూసివేసి ఇబ్బందులు పెడుతున్న అధికారుల చర్యలతో నష్టం కలుగుతుందని, విద్యుత్ సరఫరా తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవసరమయితే డిల్లీ కి వెళ్లి న్యాయం జరిగే వరకు పేదల పక్షాన పోరాటం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆయన వెంట మాజీ నాయకులు కేసీ నర్సింహులు, గంజి వెంకన్న,శివరాజ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Next Story