కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది ధ్యార‌పోగు వెంక‌టేష్

by Ratna Kumari |

కాంగ్రెస్ పార్టీ త‌న‌ను న‌మ్మించి మోసం చేసింద‌ని ధ్యార పోగు వెంక‌టేష్ పేర్కొన్నారు. సోమ‌వారం వ‌న‌ప‌ర్తి ప‌ట్ట‌ణంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది ధ్యార‌పోగు వెంక‌టేష్
X

దిశ, వనపర్తి టౌన్ : కాంగ్రెస్ పార్టీ త‌న‌ను న‌మ్మించి మోసం చేసింద‌ని ధ్యార పోగు వెంక‌టేష్ పేర్కొన్నారు. సోమ‌వారం వ‌న‌ప‌ర్తి ప‌ట్ట‌ణంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో టికెట్ ఇస్తానని చెప్పి నమ్మించి నన్ను మోసం చేసిందని 21 వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. తాను 2000 నుంచి కాంగ్రెస్ పార్టీ కొరకు పని చేశానని, గత ఎన్నికలలో నాకు కౌన్సిలర్ గా అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, ఈసారి జరగబోయే ఎన్నికలలో టికెట్ కావాలని అడిగినప్పుడు వనపర్తి ఎమ్మెల్యే మెఘా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి నకే టికెట్ ఇస్తాం పని చేసుకోమని చెప్పార‌ని.. ఈ తరుణంలో చిన్నారెడ్డి వర్గానికి ఆరు టికెట్ల కు ఒప్పందం కుదుర్చుకున్నారని, 21 వ వార్డు కచ్చితంగా చిన్నారెడ్డి వర్గానికి కావాలని, పట్టుబట్టారని చేసేదేమీ లేక మేఘారెడ్డి మౌనం వహించారని ఆయన అన్నారు. పార్టీ కొరకు పని చేస్తున్నటువంటి త‌న‌కు అన్యాయం జరిగిందని, వార్డుతో సంబంధం లేనటువంటి ఆమెకు అవకాశం ఇవ్వడం ఏంటని ఈ వార్డులో ఏదైనా సమస్య తలెత్తితే ఆమె రెడీ అయి ఇక్కడికి వచ్చేలాగా జరగాల్సిన వ్యవహారం జరుగుతుందని అన్నారు.


ఈ వార్డులో డబ్బు గల బీజేపీ, డబ్బు గల కాంగ్రెస్ నాయకులు పోటీలో ఉన్న కూడా ,ఈ వార్డు ప్రజలు నీవు నిలబడాలని, నన్ను ఒప్పించి నాతో తిరుగుతూ, నాకు సహకరించి ప్రచారంలో నాకు ఓట్లేసి నన్ను గెలిపించారు. ఇక్కడ కూడా నాకు మోసం జరిగింది. గెలిచింది నేనే అని, నాకు అధికారులు తెలిపిన, పై నుంచి ఫోన్ రావడంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ తప్పు తప్పుగా తడబడుతూ చేశారని, తిరిగి నేను రీకౌంటింగ్ అడుగుతే భయభ్రాంతులతో, దూరంగా ఉంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్మిన నాయకులను భుజాల వేసుకోకుండా డబ్బు ఉన్నటువంటి వారికి అవకాశం ఇస్తూ డబ్బుతో కొనసాగే కాంగ్రెస్ పార్టీగా మార్చారని ఆయన అన్నారు. త‌న‌కు పార్టీ నుంచి కచ్చితంగా బీఫామ్ ఇస్తానని హామీ ఇచ్చినందు వ‌ల్ల‌నే నామినేషన్ వేయడం జరిగిందని బీ ఫారం కొరకు కాంగ్రెస్ కార్యాలయం ముందే, నేనే ఒక మామూలు వ్యక్తిగా, మూడున్నర గంటలు వేచి చూశానని.. కనీసం నాకు ఇవ్వనని కూడా నాతో చెప్పలేదని, కనీసం నాతో కూడా ఆమెకు ఇస్తున్నానని కూడా చెప్పలేదని అందుకే నేను రెబల్ గా పోటీ చేశానని తెలిపారు. అటువంటి నమ్మకంగా పనిచేసేటటువంటి వారికి మోసం చేస్తూ నన్ను పార్టీ నుంచి బహిష్కరించడం దారుణమని,ఈ బహిష్కరణను వెంటనే ఎత్తివేయాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

Next Story