ఆశాల‌ సర్వే పెండింగ్ డబ్బులు ఇవ్వాలని కలెక్టరేట్ ముందు ధర్నా

by Ratna Kumari |

దిశ, వనపర్తి టౌన్ : ఆశా వ‌ర్క‌ర్ల పెండింగ్ స‌ర్వే డ‌బ్బులు ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముందు ఆశావ‌ర్క‌ర్లు ధ‌ర్నా

ఆశాల‌ సర్వే పెండింగ్  డబ్బులు ఇవ్వాలని కలెక్టరేట్ ముందు ధర్నా
X

దిశ, వనపర్తి టౌన్ : ఆశా వ‌ర్క‌ర్ల పెండింగ్ స‌ర్వే డ‌బ్బులు ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముందు ఆశావ‌ర్క‌ర్లు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఆశావ‌ర్క‌ర్లు ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో పెండింగ్ వేతనాలు ఇవ్వాలని పిక్స్ డ్ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. క‌లెక్ట‌ర్ సూప‌రింటెండెంట్ ఆఫీస‌ర్ కి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు R N రమేష్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు K సునీత, బుచ్చమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బోబిలి నిక్సన్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న లెప్రసీ డబ్బులని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్స్ పోలియో డబ్బులు, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు, నేటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని వెంటనే విడుదల చేయాలని కోరారు.


ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఆశాలకి 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఆశలకి 18,000 ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలని నెరవేర్చకుంటే రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని నడిరోడ్డుపై నిలేస్తామని హెచ్చరించారు. DMHO సాయినాథ్ రెడ్డి రెండు వారాలలో పెండింగ్ లెప్రసీ డబ్బులు ఇస్తామని ఇవ్వలేదు. వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఆశాల సమస్యలను పరిష్కరించకుంటే ఛ‌లో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాల్సి వస్తుంది అన్నారు. ఆశాల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ , అధికార యంత్రాంగం స్పందించాలని లేదంటే ఆశల పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ జిల్లా నాయకురాలు గిరిజ, ఇందిరా, లత, అలివేల, శ్యామల, చెనమ్మ, భాగ్యమ్మ, లక్ష్మి, మహేశ్వారమ్మ పాల్గొన్నారు

Next Story