మన్నెంకొండ బ్రహ్మోత్సవాలకు 100 బండ్లతో బయలుదేరిన భక్తులు..

by Disha Web |
మన్నెంకొండ బ్రహ్మోత్సవాలకు 100 బండ్లతో బయలుదేరిన భక్తులు..
X

దిశ, దామరగిద్ద: మండలంలోని ఉల్లిగుండం గ్రామం నుంచి ఎద్దుల బండ్లపై మన్నెంకొండకు భక్తులు బయలుదేరారు. సుమారు 100 ఎద్దుల పండ్లు బయలుదేరాయి. గ్రామంలోని 80 శాతం ప్రజలు మన్యంకొండ ఉత్సవాలకు ప్రతి సంవత్సరం వెళ్తారు వీరి ఎద్దుల బండి ప్రయాణం ఆరు రోజులు ఉంటుంది. శుక్రవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉల్లిగుండం నుంచి బయలుదేరి శనివారం రోజు ఉదయం 10 గంటల వరకు మన్నెంకొండ చేరుకుంటారు.

రెండు రోజులు మన్నెంకొండలో బస చేసి నాలుగవ రోజు బయలుదేరుతారు. మళ్ళీ ఊరికి ఆరవ రోజు చేరుకుంటారు. వీరి ప్రయాణం అంతా కూడా కాలినడక ఎద్దుల బండి పైన ఉంటుంది. ఈ ఊరు నుంచి మన్నెంకొండకు వెళ్లడం పురాతనం నుండి ఆనవాయితీగా వస్తున్నది. చాలా కుటుంబాలు ఎద్దుల బండి ప్రయాణం ద్వారానే బయలుదేరుతారు. ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యమంలో భోజన విశ్రాంతి సమయాలు కూడా తీసుకొని ఒక రాత్రి అడవిలో బస చేస్తారు. ఆరు రోజులకు కావలసిన అన్ని సౌకర్యాలను కూడా మొదటిగాని ఏర్పాటు చేసుకుని ఇంటి నుండి బయలుదేరుతారు.
Next Story

Most Viewed