భక్తుడి పై లడ్డు కౌంటర్ సిబ్బంది దాడి

by Nallavelli.Anjaneyulu |

దిశ, చిన్నచింతకుంట: శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడి పై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. శనివారం కావడంతో స్వామివారి దర్శనం కోసం భ‌క్తులు భారీగా తరలివచ్చారు. అయితే దర్శనం

భక్తుడి పై లడ్డు కౌంటర్ సిబ్బంది దాడి
X

దిశ, చిన్నచింతకుంట : శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడి పై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. శనివారం కావడంతో స్వామివారి దర్శనం కోసం భ‌క్తులు భారీగా తరలివచ్చారు. అయితే దర్శనం కోసం నారాయణపేట జిల్లాకు చెందిన ఇద్దరు తహశీల్దార్లు, రఘువీర్ యాదవ్ వచ్చారు. ఆలయ ఈవో పర్మిషన్ తీసుకొని ప్రత్యక్ష దర్శనం కోసం ప్రయత్నం చేస్తూ స్వామివారి మెట్ల గుండా లడ్డు తయారీ గది పక్కనుంచి వెళుతున్న సమయంలో లడ్డు గుత్తేదారుడు దారిలో కట్టెలు అడ్డువేయడంతో భక్తులకు గుత్తి దారుడుకి వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలోనే అక్కడే లడ్డు అమ్ముతున్న సిబ్బంది భక్తుడి పై దాడి చేశారు. దాడి చేసిన వారిపై భక్తుడు ఈవో కి ఫిర్యాదు చేశారు.

Next Story